Sportsఐపీఎల్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్‌... చెన్నై ఆడడంపై సందేహాలే..!

ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్‌… చెన్నై ఆడడంపై సందేహాలే..!

ఐపీఎల్ 2020కు గ‌త ఆరేడు నెల‌లుగా ఎన్నో అడ్డంకులు ఎదుర‌వుతున్నాయి. క‌రోనా నేప‌థ్యంలో ఈ మార్చిలో ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ గ‌త ఐదారు నెల‌లుగా ముందుకు సాగ‌డం లేదు. చివ‌ర‌కు భార‌త్‌లో క‌రోనా కోర‌లు చాస్తుండ‌డంతో చివ‌ర‌కు ఐపీఎల్‌ను కుదించి దుబాయ్‌లో నిర్వ‌హించేందుకు బీసీసీఐ రెడీ అయ్యింది. ఇప్ప‌టికే 8 జ‌ట్లు దుబాయ్‌కు చేరుకుని ప్రాక్టీస్ ప్రారంభించినా చెన్నై సూప‌ర్ కింగ్స్ టీంలో ఏకంగా 13 మంది సిబ్బందికి క‌రోనా సోక‌డంతో ఐపీఎల్ ఆట‌గాళ్లో తీవ్ర ఆందోళ‌న నెల‌కొంది.

చెన్నై ఆట‌గాళ్ల‌లో, సిబ్బందిలో 13 మందికి క‌రోనా రావ‌డంతో అస‌లు చెన్నై టీం ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడుతుందా ? అన్న సందేహాలు కూడా క‌లుగుతున్నాయి. చెన్నై సూప‌ర్ కింగ్స్ బౌలర్ దీపక్ చాహర్, బ్యాట్స్ మాన్ రితురాజ్ గైక్వాడ్ లకు కరోన నిర్ధారణ అయ్యింది. దీనిపై సౌర‌వ్ గంగూలీ మాట్లాడుతూ తాను చెన్నై ప‌రిస్థితిపై ఇప్పుడే మాట్లాడ‌లేన‌ని.. షెడ్యూల్ ప్ర‌కారం చెన్నై ఐపీఎల్లో ఆడుతుందో ?  లేదో ?  కూడా తానేమి చెప్ప‌లేన‌ని గంగూలీ స్ప‌ష్టం చేశారు.

ఈ వార్త ఐపీఎల్ ఫ్యాన్స్‌కు, చెన్నై టీంకు బిగ్ షాక్ అనే చెప్పాలి. దీంతో అస‌లు చెన్నై టీం ఐపీఎల్లో ఆడుతుందా ?  లేదా ?  అన్న‌ది సందేహంగా ఉంటే ఒక‌వేళ ఆడినా షెడ్యూల్ ప్ర‌కారం ఆ టీం ఆడ‌డం కూడా క‌ష్టంగానే క‌నిపిస్తోంది. ఇక ఐపీఎల్ స‌వ్యంగా జ‌రుగుతుంద‌ని తాను ఆశిస్తున్న‌ట్టు గంగూలీ చెప్పారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news