Gossipsబిగ్‌బాస్ 4 కంటెస్టెంట్‌కు క‌రోనా పాజిటివ్‌... అస‌లు జ‌రిగింది ఇదే...

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్‌కు క‌రోనా పాజిటివ్‌… అస‌లు జ‌రిగింది ఇదే…

మ‌రో ఐదారు రోజుల్లో బిగ్‌బాస్ 4 తెలుగు వెర్ష‌న్ మ‌రి కొద్ది రోజుల్లోనే ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే 16 మంది కంటెస్టెంట్స్‌ ఎంపిక చేసిన షో నిర్వాహ‌కులు వారంద‌రికి కోవిడ్ ప‌రీక్ష‌లు చేసి నెగిటివ్ అని నిర్దార‌ణ అయ్యాకే వారిని హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోట‌ల్లో క్వారంటైన్‌లో ఉంచారు. ఇక మూడో సీజ‌న్ హోస్ట్ చేసిన నాగార్జునే నాలుగో సీజ‌న్‌కు సైతం హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న సంగ‌తి తెలిసిందే. నాగార్జున పుట్టిన రోజు అయిన ఆగ‌స్టు 29 లేదా 30న షో ప్రారంభం కానుంద‌ని అంటున్నారు.

బిగ్‌బాస్‌కు అంతా రంగం సిద్ధం అవుతోంది అనుకుంటోన్న టైంలో ఓ షాకింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. బిగ్‌బాస్ కంటెస్టెంట్లలో ఒక‌రికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని తెలుస్తోంది. క‌రోనా విష‌యంలో ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా కూడా ఒక కంటెస్టెంట్‌కు క‌రోనా వ‌చ్చేసిందంటున్నారు. దీంతో స‌ద‌రు కంటెస్టెంట్‌ను ప్ర‌త్యేక క్వారంటైన్‌లో ఉంచి చికిత్స చేస్తున్నార‌ట‌. షో ప్రారంభానికి ముందు మ‌రోసారి ప‌రీక్ష చేసి నెగిటివ్ వ‌చ్చాకే స‌ద‌రు కంటెస్టెంట్‌ను లోప‌ల‌కు పంపుతార‌ని అంటున్నారు.

ఇక ఈ సారి హౌస్ మ‌రింత క‌ల‌ర్‌ఫుల్‌గా ఉండాల‌ని నిర్వాహ‌కులు టాప్‌ యాంకర్లు, ఇతర నటీనటులతో పాటుగా టిక్‌టాక్‌ స్టార్లను ఎంపిక చేశారు. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్న న్యూస్ ప్ర‌కారం జబర్దస్త్‌ కెవ్వు కార్తీక్‌, సింగర్ నోయల్‌ సేన్‌, యాంకర్లు లాస్య, అరియానా, నటులు కరాటే కళ్యాణి, సురేఖా వాణి, పూనమ్ బజ్వా, పూజిత పొన్నాడ, యూట్యూబర్లు అలేఖ్య హారిక, మహబూబ్ దిల్‌ సే, గంగవ్వ, కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్‌లు కంటెస్టెంట్‌లుగా ఉండబోతున్నట్లు సమాచారం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news