Moviesప్లాప్ మూవీతో ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసిన అఖిల్‌

ప్లాప్ మూవీతో ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసిన అఖిల్‌

సౌత్‌లో మ‌న హీరోలు న‌టించిన ప్లాప్ సినిమాల‌ను హిందీలోకి డ‌బ్ చేసి వ‌దిలితే అక్క‌డ యూట్యూబ్‌లో దుమ్మురేపేలా రికార్డు స్థాయిలో వ్యూస్ రాబ‌డుతున్నాయి. అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాల‌కు ఇక్క‌డ ప్లాప్ అయినా హిందీ డ‌బ్బింగ్‌లో మాత్రం దుమ్ము రేపే వ్యూస్ రాబ‌డుతున్నాయి. తాజాగా అక్కినేని వార‌సుడు అఖిల్ న‌టించిన మిస్ట‌ర్ మ‌జ్ను సినిమా హిందీ డ‌బ్బింగ్ వెర్ష‌న్ యూ ట్యూబ్‌లో పెట్టారు. ఈ సినిమా యూట్యూబ్‌లో పెట్టిన 40 గంట‌ల్లోనే ఏకంగా 20 మిలియ‌న్ల వ్యూస్ రాబ‌ట్టి రికార్డు సొంతం చేసుకుంది.

 

ఈ క్ర‌మంలోనే నెల రోజుల్లో 100 మిలియ‌న్ల వ్యూస్‌తో పాటు 1.3 మిలియన్ లైక్స్ సాధించడం విశేషం. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో
నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. థమన్ సంగీతం అందించిన ఈ మూవీ తెలుగులో ప్లాప్ అయ్యింది. అయితే హిందీ వెర్ష‌న్ మాత్రం కుమ్మేసింది. ఇదిలా ఉంటే అఖిల్ అన్న నాగ‌చైత‌న్య న‌టించిన సవ్యసాచి కూకూడా యూట్యూబ్ లో 100 మిలియన్ కి పైగా వ్యూస్ సొంతం చేసుకుంది.

ఇక హిందీలో డ‌బ్బింగ్ చేసి రిలీజ్ చేసిన రామ్ నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ , ఇస్మార్ట్ శంకర్, నితిన్ అ ఆ, ఛ‌ల్ మోహన్ రంగా, శ్రీనివాస కల్యాణం, అల్లు అర్జున్ సరైనోడు డీజే, బెల్లంకొండ శ్రీనివాస్ క‌వ‌చం, జ‌య‌జాన‌కీ నాయ‌క సినిమాలు కూడా అక్క‌డ 100 మిలియ‌న్ల వ్యూస్ రాబ‌ట్టాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news