Gossipsఆచార్య‌లో మెయిన్ కీ పాయింట్ అదేన‌ట‌.. బొమ్మ బ్లాక్ బ‌స్ట‌రే

ఆచార్య‌లో మెయిన్ కీ పాయింట్ అదేన‌ట‌.. బొమ్మ బ్లాక్ బ‌స్ట‌రే

మెగాస్టార్ చిరంజీవి – కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఆచార్య సినిమా మోష‌న్ పోస్ట‌ర్‌తో ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు పెంచేసింది. ధ‌ర్మ‌స్థ‌లి అనే ఊరికోసం జ‌రిగిన పోరాటం ఎలా ముగిసింది ? అన్న కాన్సెఫ్ట్‌తోనే ఈ సినిమా తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా క‌రోనా నేప‌థ్యంలో వాయిదా ప‌డింది. కాజ‌ల్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాకు మ‌ణిశ‌ర్మ స్వ‌రాలు అందిస్తున్నారు.

ఇక ఈ సినిమా క‌థ మ‌న‌కు వినిపిస్తోన్న స‌మాచారం ప్ర‌కారం ఆల‌యాల్లో విగ్రహాల చోరీ,  దేవాలయ భూముల విషయమై  జరుగుతున్న అక్రమాల నేప‌థ్యంలో ఉంటుంద‌ని తెలుస్తోంది. అన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగులు జోడించిన కొర‌టాల చిరు ఇమేజ్‌కు స‌రిపోయేలా తెర‌కెక్కిస్తున్నార‌ట‌. సినిమాలో మెయిన్ లైన్‌తో పాటు చిరు రోల్‌కు సంబంధించి వ‌చ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కీ పాయింట్స్ కానున్నాయంటున్నారు.

ఇక చిరు ప‌దేళ్ల త‌ర్వాత రీ ఎంట్రీ ఇచ్చినా ఖైదీ రీమేక్ మూవీ కావ‌డంతో కొన్ని మ‌సాలాలు అందులో మిస్ అయ్యారు. సైరా చారిత్ర‌క నేప‌థ్యం ఉన్న క‌థాంశం కావ‌డంతో అందులోనూ చిరు ఫుల్ మాస్ మ‌సాలాలు దట్టించ‌లేదు. ఇప్పుడు ఆచార్య‌తో కొర‌టాల మెగా ఫ్యాన్స్‌కు ఆ లోటును పూర్తిగా తీర్చేయ‌నున్నార‌ట‌. ఓవ‌రాల్‌గా ఆచార్య బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌న్న‌ టాక్‌నే ఇండ‌స్ట్రీలో న‌డుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news