Politicsక్వారంటైన్‌లో క‌మెడియ‌న్ 30 ఇయ‌ర్స్ పృథ్వీ... నెగిటివ్ వ‌చ్చినా అదే జ‌రిగింది..!

క్వారంటైన్‌లో క‌మెడియ‌న్ 30 ఇయ‌ర్స్ పృథ్వీ… నెగిటివ్ వ‌చ్చినా అదే జ‌రిగింది..!

కరోనా మ‌హ‌మ్మారి విశ్వ‌రూపం చూపిస్తోంది. పలువురు సెల‌బ్రిటీలు సైతం క‌రోనా దెబ్బ‌తో విల‌విల్లాడుతున్నారు. ఇక టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఇప్ప‌టికే కొంద‌రికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ద‌ర్శ‌కుడు తేజతో పాటు మ‌రో స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి కుటుంబ స‌భ్యుల‌కు క‌రోనా సోకిన సంగ‌తి తెలిసిందే. వీరంతా ఇప్ప‌టికే సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఇక ఇప్పుడు టాప్ క‌మెడియ‌న్ 30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ పృథ్వీరాజ్‌కు సైతం క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌న్న అనుమానంతో ఆయ‌న హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు.

 

వాస్త‌వంగా గ‌త వారం ప‌ది రోజుల నుంచి పృథ్వీ అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. ఎందుకైనా మంచిద‌ని క‌రోనా టెస్టులు చేయిస్తే.. నెగిటీవ్ వ‌చ్చింది. అయినా క‌రోనా ల‌క్ష‌ణాలు ఉండ‌డంతో పాటు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురి కావ‌డంతో ఆయ‌న రిస్క్ చేయ‌డం ఇష్టంలేక వైద్యుల సూచ‌న మేర‌కు సోమ‌వారం రాత్రి ఆయ‌న హైద‌రాబాద్ లోని ఓ ఆసుప‌త్రిలో చేరిపోయారు. ఈ విష‌యాన్ని ఫృథ్వీనే సోష‌ల్ మీడియాలో స్వ‌యంగా వెల్ల‌డించారు. త‌ను త్వ‌ర‌లోనే కోలుకుంటాన‌ని, అందుకు ప్రేక్ష‌కుల ఆశీర్వాదాలు, భ‌గ‌వంతుడి ఆశీస్సులు కావాల‌న్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news