కెజిఎఫ్-2కి అదిరిపోయే ఆఫర్..!

కన్నడ సినిమానే అయినా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో దుమ్ముదులిపేసిన సినిమా కెజిఎఫ్. ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో యష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం అందుకుంది. ఈ సినిమాకు సీక్వల్ గా కెజిఎఫ్ 2 ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఈ సీక్వల్ లో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ డాట్, రవీనా టాండన్ నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమాపై అంచనాలు పెంచగా టీజర్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమాకు సంబందించిన డిజిటల్ రైట్స్ భారీ రేంజ్ పలికాయట. అమెజాన్ 55 కోట్ల భారీ డీల్ తో కెజిఎఫ్ చాప్టర్ 2 డిజిటల్ రైట్స్ కొనేశారట. తెలుగు, కన్నడ, మళయాళ, హిందీ, తమిళ రైట్స్ తో కలిపి ఈ రేటు ఫిక్స్ చేశారట. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కెజిఎఫ్ అన్ని భాషల్లో సెన్సేషనల్ హిట్ అయ్యింది. అయితే ఇప్పుడు ఆ సినిమా సీక్వల్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సీక్వల్ కూడా అంచనాలను అందుకునేలా ఉంటుందో లేదో చూడాలి. డిజిటల్ రైట్స్ లో అదరగొడుతున్న ఈ సినిమా శాటిలైట్, థియేట్రికల్ రైట్స్ లో కూడా దుమ్ముదులిపేయడం ఖాయమని చెప్పొచ్చు.

Leave a comment