వరల్డ్ ఫేమస్ లవర్ క్లోజింగ్ కలెక్షన్లు.. డిజాస్టర్‌కు కేరాఫ్!

టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్, ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాతో మరోసారి అర్జున్ రెడ్డి లాంటి సూపర్ హిట్ కొట్టాలని విజయ్ దేవరకొండ ఫిక్స్ అయ్యాడు. ఇక ఈ సినిమాలో ఏకంగా నలుగురు హీరోయిన్లతో మనోడు రొమాన్స్ చేస్తుండటంతో ఈ సినిమాపై యూత్ చాలా అంచనాలు పెట్టుకున్నారు.

అయితే ఈ సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు లేకపోవడంతో ఈ సినిమాకు తొలిరోజే నెగెటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమాకు రివ్యూలు కూడా నెగెటివ్‌గా రావడంతో ఈ సినిమాను ప్రేక్షకులు తిప్పికొట్టారు. ఫలితంగా సినిమాకు కలెక్షన్లు చాలా దారుణంగా వచ్చాయి. అయితే విజయ్ దేరకొండ క్రేజ్‌ను క్యాష్ చేసుకుందామని బయ్యర్లు ఈ సినిమా హక్కులను ఏకంగా రూ.30 కోట్లకు పైగా చెల్లించి సొంతం చేసుకున్నారు.

కానీ ఈ సినిమా టోటల్ రన్‌లో కేవలం రూ.10.15 కోట్లు మాత్రమే వసూళ్లు సాధించి పెద్ద డిజాస్టర్ మూవీగా నిలిచింది. విజయ్ దేవరకొండ తప్ప ఈ సినిమాకు కలిసొచ్చే అంశం ఏదీ లేకపోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిచానా ఎత్తేసింది. ఇక ఏరియాల వారీగా ఈ సినిమా టోటల్ రన్‌లో కలెక్ట్ చేసిన ఫైనల్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా – టోటల్ కలెక్షన్స్
నైజాం – 3.85 కోట్లు
సీడెడ్ – 0.90 కోట్లు
నెల్లూరు – 0.31 కోట్లు
కృష్ణా – 0.51 కోట్లు
గుంటూరు – 0.74 కోట్లు
వైజాగ్ – 0.81 కోట్లు
ఈస్ట్ – 0.59 కోట్లు
వెస్ట్ – 0.44 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 8.15 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 1.00 కోట్లు
ఓవర్సీస్ – 1.00 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – 10.15 కోట్లు