తారక్‌కు ఇద్దరు కావాలట!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ కొట్టేందుకు పక్కా ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో తారక్ ఓ సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు. అయితే ఈ సినిమాలో తారక్‌ను ఓ పొలిటీషియన్‌గా మనకు చూపిస్తాడట త్రివిక్రమ్.

అయితే ఈ సినిమాలో తారక్ సరసన ఇద్దరు హీరోయిన్లను నటింపజేయాలని చూస్తున్నారు చిత్ర యూనిట్. తారక్‌తో అరవింద సమేతలో నటించి మెప్పించిన పూజా హెగ్డేను మరోసారి ఈ సినిమాలో హీరోయిన్‌గా పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఇక మరో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్‌ను తీసుకోవాలని త్రివిక్రమ్ అండ్ టీమ ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్‌లో ఆలియా భట్ చరణ్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఈ ఇద్దరు బ్యూటీలతో రొమాన్స్ చేసేందుకు తారక్ రెడీ అవుతున్నాడు. మరి ఈ ఇద్దరు బ్యూటీలకు ఎలాంటి ప్రాముఖ్యత ఉన్న పాత్రలు దక్కుతాయో చూడాలి అంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమా షూటింగ్‌ను అతి త్వరలో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.