చిరు తరువాత కొరటాల దారెటు?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాతో మెగాస్టార్ మరోసారి తన స్టామినా ఏమిటో టాలీవుడ్ బాక్సాఫీస్‌కు చూపెట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఒక్క ఫ్లాప్ కూడా లేని కొరటాల శివతో మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సినిమాను తీసుకొస్తు్న్నాడా అనే ఆతృత అందరిలో మొదలైంది. అటు ఈ సినిమా పూర్తిగా సోషల్ మెసేజ్ ఉన్న సినిమాగా వస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమా తరువాత కొరటాల తన నెక్ట్స్ మూవీని ఎవరితో తెరకెక్కిస్తాడా అనే విషయం అప్పుడే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చిరు సినిమాలో ఓ కీలక పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో చరణ్ కోసం కొరటాల ఓ స్క్రిప్టును రెడీ చేశాడట.

కానీ కొన్ని కారణాల వల్ల అది పట్టాలెక్కలేదు. దీంతో ఇప్పుడు మరోసారి చరణ్‌తో కలిసి ఆ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాలని కొరటాల ప్లాన్ చేస్తు్న్నాడట. కథ విన్న చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆచార్య సినిమాను ముగించిన వెంటనే చరణ్, కొరటాల శివ చిత్రం పట్టాలెక్కే ఛాన్స్ ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.