అల్లు అర్జున్‌ను ‘బే’ అంటూ పిలిచింది ఎవరో తెలుసా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ అల వైకుంఠపురములో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలవడంతో బన్నీ చాలా సంతోషంగా ఉన్నాడు. ఇక తన నెక్ట్స్ మూవీని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్న బన్నీ, తన పర్సనల్ లైఫ్‌లో తన కూతురు అర్హాతో ఎక్కువ సమయాన్ని కేటాయిస్తుంటాడు.

కాగా అర్హా తన తండ్రితో ఎలా ఉంటుందో ఇప్పటికే మనం చాలా వీడియోల్లో చూశాం. తమ మధ్య ఉన్న బంధాన్ని బన్నీ తరుచూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. కాగా తాజాగా అర్మాతో కలిసి ఉన్న మరో వీడియోను బన్నీ పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో బన్నీని అర్హా బే అంటూ పిలవడంతో బన్నీ అవాక్కయ్యాడు. డాడీని బే అంటావా అంటే, అంటాను బే అని అర్హా యాన్సర్ ఇవ్వడంతో బన్నీ రియాక్షన్ ఎలా ఉందో ఈ వీడియో మనకు కనిపిస్తుంది. అయితే ఇదంతా కేవలం సరదాగా మాత్రమే తాను చూస్తానని బన్నీ చెప్పుకొచ్చాడు.

ఇక బన్నీ పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా బన్నీ తన నెక్ట్స్ మూవీ షూటింగ్‌ను ఇప్పటికే ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది.

Leave a comment