మూతి ముద్దులకు నేను రెడీ..!

టాలీవుడ్ లో హీరోయిన్స్ ఎవరు ఎలా క్రేజ్ సంపాదిస్తారో ఎవరికీ తెలియదు. ఐరన్ లెగ్ అనిపించుకున్న భామలు సైతం తర్వాత వరుస ఛాన్సులు అందుకుంటారు. ఒకరి రెండు సినిమాల్లో పర్వాలేదు అనిపిచ్చుకున్న వారు వెనుకపడి పోతారు. తెలుగు, తమిళ భాషల్లో అదరగొట్టాలని చూస్తున్న భామల్లో ఐశ్వర్య రాజేష్ ఒకరు. తెలుగులో ఒకప్పుడు నటించిన రాజేష్ తనయురాలే ఐశ్వర్య రాజేష్.

తమిళంలో ఆల్రెడీ సూపర్ సక్సెస్ అయిన ఈ అమ్మడు తెలుగులో మాత్రం సరైన హిట్ అందుకోలేదు. తెలుగులో మొదటి సినిమా విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమానే అయినా రిలీజ్ అయ్యింది మాత్రం కౌసల్య కృష్ణమూర్తి. అది కూడా తమిళంలో సూపర్ హిట్ అయిన కణ రీమేక్ గా వచ్చింది. ఆ సినిమా ఫ్లాప్ అవగాఆ తర్వాత వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ కూడా నిరాశ పరచింది. ఈమధ్యలో వచ్చిన మిస్ మ్యాచ్ మూవీ అయితే వచ్చింది వెళ్లింది ఎవరికీ తెలియదు.

అందం కన్నా అభినయంతో అలరిస్తున్న ఐశ్వర్య.. కథ డిమాండ్ చేస్తే లిప్ లాక్ చేసేందుకు రెడీ అంటుంది. తమిళంలో ఆల్రెడీ ధనుష్, అధర్వ లాంటి హీరోలతో మూతి ముద్దులు కానిచ్చిన ఐశ్వర్య రాజేష్ కథకు అవసరం అనిపిస్తే తప్పకుండా తెలుగులో కూడా లిప్ లాక్ చేస్తా అంటుంది. మరి అమ్మడి టాలెంట్ గుర్తించి ఎవరు అవకాశం ఇస్తారో చూడాలి.