రెడ్ టీజర్ టాక్: కళ్యాణ్‌రామ్‌ను దించేసిన రామ్

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం రెడ్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా మెజారిటీ షూటింగ్ పూర్తి కాగా ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్‌బస్టర్ తరువాత రామ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ఇక తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ పవర్‌ప్యాక్డ్‌గా రూపొందటంతో రామ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ చేసుకుంటున్నారు. అయితే ఈ టీజర్‌లో కొత్తదనం లేకపోవడంతో ఈ సినిమా కళ్యాణ్ రామ్ నటించిన హరే రామ్ అనే సినిమా కథకు దగ్గరగా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో రామ్ డ్యుయెల్ రోల‌లో నటిస్తుండటమే దీనికి అసలు కారణమని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

ఏదేమైనా మరోసారి ఔట్ డేటెడ్ కథతో రామ్ మన ముందుకు రానున్నాడనే వార్త మాత్రం ఈ సినిమా టీజర్ చూస్తూ ఇట్టే అర్థమవుతోంది. ఈ సినిమాను కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను స్రవంతి రవికిషోర్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి అంటున్నారు ప్రేక్షకులు.

Leave a comment