Gossipsమాటల మాంత్రికుడినే నమ్ముకున్న పవన్

మాటల మాంత్రికుడినే నమ్ముకున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో పాటు వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. కాగా ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్‌’ను తెలుగులో రీమేక్ చేస్తున్న పవన్, ఆ తరువాత తన నెక్ట్స్ మూవీని దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో చేయబోతున్నాడు. అయితే ఈ సినిమా రాబిన్‌హుడ్ తరహా పీరియాడికల్ మూవీగా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.

దీంతో మాస్ ప్రేక్షకులతో పాటు క్లాస్ ప్రేక్షకులను అలరించే విధంగా ఓ కథ చేయాలని పవన్ కోరుతున్నాడు. దీని కోసం తన ఆప్తమిత్రుడైన త్రివిక్రమ్‌ను ఓ అదిరిపోయే స్క్రిప్టును రెడీ చేయాలని కోరాడట పవన్. అంటే ఈ లెక్కన పవన్, త్వరలో త్రివిక్రమ్‌లో మరో సినిమా చేయడానికి చాలా ఆసక్తిగా ఉన్నాడని తెలుస్తోంది. దీంతో వీరి కాంబినేషన్‌లో రాబోయే సినిమా ఎప్పుడు వస్తుందా అనే ఆసక్తి అప్పుడే ఇండస్ట్రీ వర్గాల్లో మొదలైంది.

గతంలో జల్సా, అత్తారింటికి దారేది వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్లుగా నిలిచాయి. కాగా అజ్ఞాతవాసి సినిమా మాత్రం అట్టర్‌ఫ్లాప్‌గా నిలవడంతో వీరి కాంబోలో మళ్లీ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news