పవన్‌ను వెంటాడుతున్న అజ్ఞాతవాసి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు రాజకీయాల్లో మరోవైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడంలో చాలా బిజీగా ఉన్నాడు. వేణు శ్రీరామ్, క్రిష్‌ డైరెక్షన్‌లో చేస్తోన్న సినిమాల షూటింగ్‌కు ఎక్కువ గ్యాప్ ఇవ్వట్లేదు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేస్తున్న ‘పింక్’ తెలుగు రీమేక్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా కొత్త రికార్డు‌‌ను క్రియేట్ చేస్తాడని పవన్ ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాపై పవన్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనుకున్నట్టు ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్, పక్కా కమర్షియల్ సీన్స్ పెద్దగా లేవట. మరి పవన్ ఫ్యాన్స్ పెట్టుకున్న ఆశలు చివరికి అజ్ఞాతవాసి మూవీకి జరిగినట్టు జరుగుతుందేమనని నెటిజన్లు కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ తెరకెక్కించిన అజ్ఞాతవాసి కూడా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడటంతో పవన్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.

అయితే క్రిష్ తెరకెక్కించబోయే సినిమా కూడా దాదాపు ఇలానే ఉండబోతుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా ఎలాంటి కథతో వస్తుందా, ఎలా ఉంటుందా అని ప్రేక్షకులు ఆందోళన చెందుతున్నారు. మరి క్రిష్ చేయబోయే ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Leave a comment