భీష్మ ఫస్ట్ వీక్ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. దుమ్ములేపిన నితిన్

యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ భీష్మ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఛలో డైరెక్టర్ వెంకీ కుడుముల డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమాను చూసేందుకు జనాలు థియేటర్లకు ఎగబడ్డారు.

ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగానూ సత్తా చాటడంతో బయ్యర్లు పూర్తి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమా రూ.25 కోట్లకు పైగా ప్రీరిలీజ్ బిజినెస్ చేయడంతో ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందా అని అందరు ఎదురుచూశారు. అయితే ఈ సినిమా అందరి అంచనాలను అధిగమించి ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా సక్సెస్ కొట్టడంతో ఈ సినిమా తొలి వారం ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.23.75 కోట్ల మేర కలెక్షన్లు కొల్లగొట్టింది.

నితిన్ యాక్టింగ్‌కు వెంకీ కుడుముల డైరెక్షన్‌ తోడు కావడంతో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమా ఏరియాల వారీ కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా – ఫస్ట్ వీక్ కలెక్షన్లు(కోట్లలో)
నైజాం – 7.50 కోట్లు
సీడెడ్ – 2.85 కోట్లు
ఉత్తరాంధ్ర – 2.58 కోట్లు
ఈస్ట్ – 1.43 కోట్లు
వెస్ట్ – 1.19 కోట్లు
గుంటూరు – 1.54 కోట్లు
కృష్ణా – 1.33 కోట్లు
నెల్లూరు – 0.59 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 19.02 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 1.75 కోట్లు
రెస్టాఫ్ వరల్డ్ – 3 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – 23.75 కోట్లు

Leave a comment