పెళ్లికి రెడీ అంటోన్న అనుష్క.. క్రికెటర్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యేనా?

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకుని స్టార్ హీరోయిన్‌గా నిలిచిన అనుష్క శెట్టి తన యాక్టింగ్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు తనకు ఎవరూ సాటిలేరని భాగమతి సినిమాతో మరోసారి నిరూపించింది. కొంత కాలంగా ఈ బ్యూటీ పెళ్లి గురించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి.

గతంలో ప్రభాస్‌‌ను ఆమె పెళ్లాడుతోందంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలను వారిద్దరు కొట్టిపడేశారు ప్రభాస్ మరియు అనుష్క. కాగా ఇప్పుడు మళ్లీ అనుష్క పెళ్లి గురించి పలు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అనుష్క భారత క్రికెట్ జట్టుకు చెందిన ఓ ఆటగాడిని ప్రేమిస్తుందని తెలుస్తోంది. అతడితో స్వీటీ పీకల్లోతూ ప్రేమలో మునిగిపోయిందని, త్వరలోనే వారిద్దరు పెళ్లిపీటలు ఎక్కడం ఖాయమని అంటున్నారు సినీ క్రిటిక్స్.

కాగా తాను ఎవరితోనూ ప్రేమలో పడలేదని, తన పెళ్లికి ఇంకా టైమ్ ఉందంటూ అనుష్క తేల్చి చెప్పేసింది. ఇలాంటి పుకార్లు పుట్టించవద్దంటూ ఆమె కోరింది. మరి అనుష్క పెళ్లి ఎవరితో జరుగుతుందా అనే అంశం ప్రస్తుతానికి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

Leave a comment