చెడ్డవాడిగా మారుతున్న బన్నీ.. ఎందుకో తెలిస్తే షాకే!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో’ సంక్రాంతి బరిలో వచ్చి బాక్సాఫిస్ వద్ద సూపర్ సక్సెస్‌ను అందుకుంది. ఈ సినిమా బన్నీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ చిత్రం అందించిన జోష్‌లో బన్నీ తన నెక్ట్స్ మూవీని కూడా మొదలుపెట్టాడు.

సుకుమార్ డైరెక్షన్‌లో బన్నీ నటించే తన నెక్ట్స్ మూవీలో డిఫరెంట్ గెటప్‌లో కనిపిస్తాడని, పూర్తిగా మాస్ అవతారంలోకి మారుతున్నాడు. అయితే ఈ సినిమాలో అందరికీ షాకిస్తూ బన్నీ ఏకంగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తాడని తెలుస్తోంది. లారీ డ్రైవర్‌గా కనిపించే బన్నీ గురించి చిత్రం క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ అదిరిపోయే రేంజ్‌లో ఉంటుందని తెలుస్తోంది.

ఇక స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ సరసన అందాల భామ రష్మిక మందన నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో బన్నీ గెటప్ కూడా మార్చనున్నట్లు తెలుస్తోంది. చాలా రఫ్ లుక్‌లో బన్నీ మనకు కనిపిస్తాడట.

Leave a comment