బాలీవుడ్‌పై కన్నేసిన బన్నీ.. అందుకే మకాం మార్పు?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాతో బన్నీ తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. కాగా ఇప్పుడు ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ క్రమంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ సినిమాను బాలీవుడ్‌లో ఓ స్టార్ హీరోను పెట్టి రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. కాగా బాలీవుడ్‌లో ఎప్పటినుండో అడుగుపెట్టాలని చూస్తు్న్న బన్నీ, ఈ సినిమా హిందీ రీమేక్‌లో తానే నటించాలని ఆలోచిస్తున్నాడట. దీని కోసం అప్పుడే అడుగులు కూడా వేస్తున్నాడట బన్నీ. తాజాగా ముంబైలో ఓ ఇల్లు కొనేందుకు బన్నీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే బన్నీ బాలీవుడ్ ఎంట్రీ ఖాయమనే అంటున్నారు సినీ వర్గాలు.

ఇక ప్రస్తుతం అల వైకుంఠపురములో సక్సెస్‌ను పూర్తిగా ఎంజాయ్ చేస్తున్న బన్నీ, తన నెక్ట్స్ మూవీని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో తీయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. అతి త్వరలో సెకండ్ షెడ్యూల్ షూట్‌కు వెళ్లనున్న ఈ సినిమాలో బన్నీ ఓ లారీ డ్రైవర్‌గా కనిపిస్తాడు.

Leave a comment