టాలీవుడ్‌ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా అఖిల్

అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ వరుసగా సినిమాలు చేస్తున్నా అనుకున్న సక్సె్స్ మాత్రం కొట్టలేక పోతున్నాడు. యావరేజ్ హిట్ సినిమాలతో నెట్టుకొస్తున్న అఖిల్, ఈసారి ఎలాగైనా అదిరిపోయే సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు. అయితే బొమ్మరిల్లు వంటి క్లాసిక్‌ను అందించిన దర్శకుడు భాస్కర్‌తో కలిసి అఖిల్ ఈ సినిమా చేస్తుండటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక ఈ సినిమా ఎలా ఉంటుందా అనే ఆసక్తి మాత్రం అందరిలోను మొదలైంది. ఈ సినిమాకు ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ పెట్టాలని చూస్తోందట. ఈ సినిమాలో అఖిల్ పాత్రకు తగ్గట్టుగా ఈ టైటిల్ ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇక ఈ సినిమాలో అఖిల్ సరికొత్త పాత్రలో నటిస్తాడని, అది అందరికీ నచ్చుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరి ఈ సినిమాతో అఖిల్ ఎలాంటి సక్సెస్ కొడతాడు అనేది ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అదిరిపోయే సక్సెస్‌ కోసం ఎదురుచూస్తున్న అఖల్ ఈ సినిమాతోనైనా అది సాధిస్తాడా లేదా అనేది క్వశ్చన్ మార్క్‌గా మిగిలింది. బొమ్మరిల్లు డైరెక్టర్ ఈ సినిమాతో కమ్ బ్యాక్ ఇస్తాడా అనేది కూడా మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.

Leave a comment