మహేష్ తరువాత రాములమ్మదే పైచేయి

తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి, మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు కొన్ని చోట్ల రికార్డు కలెక్షన్స్ వచ్చినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి రీఎంట్రీ ఇవ్వడంతో ఈ సినిమాలో ఆమెకు చాలా ప్రాముఖ్యం ఉన్న పాత్ర లభించింది. ఇక ఈ సినిమాకు ఆమె తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత..? అనే అంశంపై సోషల్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు తరువాత ఆమెదే ఎక్కువ రెమ్యునరేషన్ అని విజయశాంతి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

అంటే.. హీరోయిన్ రష్మిక మందన్న కంటే కూడా తన రెమ్యునరేషన్ ఎక్కువ అని విజయశాంతి చెప్పారు. దాదాపు 13 ఏళ్ల గ్యాప్ తరువాత ఈ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతికి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మరి ఈ సినిమా తరువాత విజయశాంతి ఎలాంటి సినిమాలు చేస్తుందా అనే అంశం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

Leave a comment