Moviesవరల్డ్ ఫేమస్ లవర్ టీజర్ టాక్.. డోస్ పెంచిన అర్జున్ రెడ్డి

వరల్డ్ ఫేమస్ లవర్ టీజర్ టాక్.. డోస్ పెంచిన అర్జున్ రెడ్డి

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో అందరికీ తెలిసిందే. ఈ ఒక్క సినిమాతో ఆయన బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేశాడు. యూత్ కావాల్సినంత కిక్ తన సినిమాల ద్వారా అందిస్తూ తనకంటూ ప్రత్యేక బ్రాండ్ ఏర్పాటు చేసుకున్నాడు. కాగా విజయ్ దేవరకొండ తాజాగా నటిస్తున్న వరల్డ్ ఫేమస్ లవర్ టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.

ఈ టీజర్ చూస్తే అర్జున్ రెడ్డి మరింత డోస్ పెంచినట్లు కనిపిస్తుంది. అర్జున్ రెడ్డిలో ఉన్న విధంగా ఈ సినిమాలోనూ గడ్డం పెంచుకుని కనిపించాడు విజయ్ దేవరకొండ. అంతేగాక అందులో ఉన్న బోల్డ్ సీన్లకంటే కాస్త మసాలా ఎక్కువే ఉందని టీజర్‌లోనూ చూపించారు చిత్ర యూనిట్. ఇక ఈ టీజర్‌లో అందాల భామలు రాశి ఖన్నా, కేథరిన్ త్రేసా, ఐశ్వర్యా రాజేష్‌లు మనకు కనిపిస్తారు. యూత్ అండ్ లవర్స్‌నే మెయిన్ టార్గెట్‌గా ఈ సినిమాను తెరకెక్కించినట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది.

ప్రముఖ నిర్మాత కెఎస్ రామారావు క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండగా, క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాను ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news