నాగ్‌కు బూస్ట్ ఇస్తానంటోన్న డైరెక్టర్

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఇటీవల నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్‌గా నిలుస్తుండటంతో ఓ మంచి సక్సెస్ కోసం నాగ్ చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. కాగా ఇటీవల మన్మధుడు 2 సినిమాతో సక్సెస్ సాధించాలని ప్రయత్నించి బోల్తా కొట్టాడు. అయితే ఈసారి మళ్లీ డిఫరెంట్ సబ్జెక్టులతో మనముందుక రావడానికి నాగ్ రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే ‘వైల్డ్ డాగ్’ అనే కాప్ థ్రిల్లర్ సినిమాలో నాగ్ నటిస్తు్న్నాడు. ఈ చిత్రాన్ని సోలోమన్ డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ ప్రాజెక్టును కూడా ఓకే చేసాడట నాగ్. గరుడవేగ లాంటి సెన్సేషనల్ మూవీని తెరకెక్కించిన అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ఓ సబ్జెక్టును నాగ్‌కి వినిపించగా, నాగ్ దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో నాగ్ ఓ ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్ పాత్రలో నటిస్తాడని తెలుస్తోంది.

ఇక నాగ్ చేస్తున్న ఈ రెండు ప్రాజెక్టులు బ్యాక్‌టు బ్యాక్ హిట్లుగా మారాలని నాగ్‌తో పాటు ఆయన ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి విభిన్నమైన సబ్జె్క్టులతో రాబోతున్న నాగ్‌కు సక్సెస్ వస్తుందా లేదా అనేది ఆయా సినిమాలు రిలీజ్ అయిన తరువాతే తెలుస్తుంది.

Leave a comment