ప్రతిరోజూ పండగే మూడు వారాల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్

మెగా కాంపౌండ్ నుండి వచ్చిన సాయి ధరమ్ తేజ్ సుప్రీం హీరోగా ఎదిగాడు. కెరీర్ ఆరంభంలో వరుస హిట్లతో దూసుకుపోయిన తేజు, ఆ తరువాత వరుస ఫ్లాపులతో సతమతమయ్యాడు. ఒక్క హిట్టు కోసం చాలా ఆశగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకటి కాదు రెండు కాదు వరుసగా ఆరు సినిమాలు ఫ్లాపులుగా మిగలడంతో తేజు సినిమాలకు గుడ్‌బై చెప్పడం బెటర్ అనే స్థాయికి పడిపోయాడు.

కానీ తేజుకి అదృష్టం దర్శకుడు మారుతి రూపంలో వచ్చిందని చెప్పాలి. తేజుతో కలిసి మారుతి ప్రతిరోజూ పండగే అనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించాడు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడంలో సక్సె్స్ కావడంతో ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద కూడా ఎలాంటి సినిమా పోటీలో లేకపోవడంతో ఈ సినిమాకు జనాలు క్యూ కట్టారు.

ప్రతిరోజూ పండగే సినిమా రిలీజ్ అయ్యి మూడు వారాలు ముగిసే సరికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.33.12 కోట్లు వసూళ్లు సాధించింది. ఫ్యామిలీ కంటెంట్ అందరికీ కనెక్ట్ కావడంతో ఈ సినిమా ఇంత భారీ కలెక్షన్స్ రాబట్టిందని చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఏరియాల వారీగా ఈ సినిమా మూడు వారాల కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా – మూడు వారాల కలెక్షన్లు(కోట్లలో)
నైజాం – 12.22 కోట్లు
సీడెడ్ – 3.88 కోట్లు
నెల్లూరు – 0.88 కోట్లు
కృష్ణా – 2.02 కోట్లు
గుంటూరు – 1.91 కోట్లు
వైజాగ్ – 4.74 కోట్లు
ఈస్ట్ – 1.99 కోట్లు
వెస్ట్ – 1.50 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 29.14 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 2.05 కోట్లు
ఓవర్సీస్ – 1.93 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – 33.12 కోట్లు

Leave a comment