అల వైకుంఠపురములో ఓపెనింగ్స్‌కు బాక్సాఫీస్ గూబ గుయ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం అల వైకుంఠపురములో చిత్రం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని అంటున్నారు బన్నీ, త్రివిక్రమ్ ఫ్యాన్స్. ఈ కాంబో మూడోసారి ప్రేక్షకులు వస్తుండటం, ఇప్పటికే ఈ సినిమాకు ఫీల్ గుడ్ ఇంప్రెషన్ రావడంతో అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి.

ఇక బన్నీ, పూజా హెగ్డేల మధ్య సాగే రొమాన్స్‌కు ఫ్యామిలీ ఎమోషన్స్‌ను యాడ్ చేసిన త్రివిక్రమ్ తనదైన మార్క్‌తో సినిమాను తీసాడని టీజర్, సాంగ్స్ ప్రోమోలు చూస్తుంటే తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. త్రివిక్రమ్ సినిమాలకు అక్కడ ఉండే క్రేజ్ మామూలుది కాదు మరి. అల వైకుంఠపురములో సినిమా ప్రీమియర్స్ రోజునే మిలయన్ మార్క్‌ను క్రాస్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ప్రస్తుతం అక్కడ అల వైకుంఠపురములో సినిమా టికెట్ రేటును 14 డాలర్లుగా నిర్ణయించారు. మరి ఈ సినిమా ప్రీమియర్ల ద్వారా మిలియన్ మార్క్ టచ్ చేసి సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తుందా లేదా అనేది చూడాలి. ఈ సినిమాకు ఓవర్సీస్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి హైప్ క్రియేట్ అయ్యింది. థమన్ అందించిన మ్యూజిక్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. జనవరి 12న రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.