Moviesసాయి ధరమ్ తేజ్ ప్రతిరోజూ పండగే ఫస్ట్ డే కలెక్షన్స్

సాయి ధరమ్ తేజ్ ప్రతిరోజూ పండగే ఫస్ట్ డే కలెక్షన్స్

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ప్రతిరోజూ పండగే డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాతో తేజు ఖచ్చితంగా హిట్ కొడతాడని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేశారు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ సినిమాకు తొలిరోజే మంచి టాక్ రావడం, పాజిటివ్ రివ్యూలు రావడం సినిమాకు బాగా కలిసొచ్చింది.

పోటీలో మరో రెండు సినిమాలు ఉన్నా ప్రతిరోజూ పండగే సినిమా చూసేందుకు ఫ్యామిలీ ఆడియెన్స్ ఓటేశారు. దీంతో ఈ సినిమా తొలిరోజు రెండు తొలి రాష్ట్రాల్లో కలిసి రూ.3.13 కోట్ల వసూళ్లు సాధించింది. తేజు మార్కెట్‌కు ఇవి మంచి ఓపెనింగ్స్ అని చెప్పాలి. ఈ వీకెండ్ ముగిసేసరికి మంచి కలెక్షన్స్ రాబట్టడం ఖాయమని అంటున్నారు చిత్ర వర్గాలు. అయితే అసలు పరీక్ష మాత్రం మండే నుండి ఉంటుందని వారు అంటున్నారు.

ఏరియాలవారీగా ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా – ఫస్ట్ డే కలెక్షన్లు
నైజాం – 1.25 కోట్లు
సీడెడ్ – 0.34 కోట్లు
నెల్లూరు – 0.18 కోట్లు
కృష్ణా – 0.21 కోట్లు
గుంటూరు – 0.30 కోట్లు
వైజాగ్ – 0.33 కోట్లు
ఈస్ట్ – 0.30 కోట్లు
వెస్ట్ – 0.22 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 3.13 కోట్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news