Moviesఆర్ఆర్ఆర్‌కు భారీ షాక్.. జక్కన్న ఫ్యూజులు ఔట్

ఆర్ఆర్ఆర్‌కు భారీ షాక్.. జక్కన్న ఫ్యూజులు ఔట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తయ్యింది. ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌పై కన్నేసిన దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాకోసం చాలా ఇంట్రెస్టింగ్ టైటిల్ అనుకున్నాడు. ఈ సినిమాలోని ఆర్ఆర్ఆర్‌కు పూర్తి న్యాయం చేసేలా రామ రావణ రాజ్యం అనే టైటిల్ అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతుందని ఆయన అనుకున్నాడు.

కానీ తాజాగా జక్కన్న ఫ్యూజులు ఔట్ చేస్తూ రామ రావణ రాజ్యం టైటిల్‌ను వేరే వారు ఎగరేసుకుపోయారు. వి3 ఫిలింస్ వారు ఫిలిం ఛాంబర్‌లో రామ రావణ రాజ్యం టైటిల్‌ను తమ పేరున రిజిస్టర్ చేయించుకున్నారు. ఆర్ఆర్ఆర్ కోసం అనుకున్న టైటిల్‌ను కాస్త వేరే వారు తన్నుకుపోవడంతో జక్కన్న బాగా అప్‌సెట్ అయ్యాడని తెలుస్తోంది. అయితే దానికంటే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఆయన వెతికే పనిలో పడ్డారని చిత్ర యూనిట్ తెలిపింది.

ఏదేమైనా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్న పవర్‌ఫుల్ మల్టీస్టారర్ చిత్రం టైటిల్‌ను ఇలా వేరే వారు ఎగరేసుకుపోవడంతో ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ కాస్త నిరాశకు లోనయ్యారు. కానీ జక్కన్న మరో పవర్‌ఫుల్ టైటిల్‌తో రావడం ఖాయమని వారు అంటున్నారు. ఈ సినిమాకు సెట్ అయ్యే ఆ పవర్‌ఫుల్ టైటిల్ ఏమిటో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news