Moviesప్రతిరోజూ పండగే 6 రోజుల కలెక్షన్స్.. పండగ చేసుకుంటున్న తేజు

ప్రతిరోజూ పండగే 6 రోజుల కలెక్షన్స్.. పండగ చేసుకుంటున్న తేజు

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ప్రతిరోజూ పండగే ఇటీవల రిలీజ్ అయ్యి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ థియేటర్లకు పరుగులు తీసారు. ఇతర సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ప్రతిరోజూ పండగే సినిమాను ఎగబడి చూస్తున్నారు ఫ్యాన్స్.

ఇక ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఈ సినిమా 6 రోజులు ముగిసే సరికి ఏకంగా రూ.15.36 కోట్లు సాధించి బ్రేక్ ఈవెన్‌కు చేరువయ్యింది. ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ మరియు మారుతి కెరీర్‌లలో ది బెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. రాశి ఖన్నా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో భారీ తారాగణం నటించింది.

ఇక ఏరియాల వారీగా ఈ సినిమా 6 రోజుల కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా – 6 రోజుల కలెక్షన్స్
నైజాం – 6.52 కోట్లు
సీడెడ్ – 1.89 కోట్లు
నెల్లూరు – 0.51 కోట్లు
కృష్ణా – 1.13 కోట్లు
గుంటూరు – 1.06 కోట్లు
వైజాగ్ – 2.30 కోట్లు
ఈస్ట్ – 1.11 కోట్లు
వెస్ట్ – 0.84 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 15.36 కోట్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news