Moviesబొమ్మరిల్లు అబ్బాయికి టక్కర్ ఇస్తానంటోన్న మలయాళీ బొమ్మ

బొమ్మరిల్లు అబ్బాయికి టక్కర్ ఇస్తానంటోన్న మలయాళీ బొమ్మ

నేచురల్ స్టార్ నాని నటించిన జెంటిల్‌మెన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మలయాళ బ్యూటీ నివేదా థామస్ ప్రస్తుతం సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీగా ప్రాచుర్యంలో ఉన్న పింక్ తెలుగు రీమేక్‌లోనూ నివేదా హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది.

కాగా బొమ్మరిల్లు సినిమాతో తెలుగులో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరో సిద్ధార్ద్, గతకొంత కాలంగా ట్రాక్ తప్పి సరైన హిట్స్ కొట్టలేకపోతున్నాడు. దీంతో తమిళంలో అడపాదడపా సినిమాలు చేస్తూ వాటినే తెలుగులోకి వదులుతున్నాడు. కాగా తాజాగా సిద్ధార్ధ్ హీరోగా టక్కర్ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా తరువాత టక్కర్ చిత్ర యూనిట్ సిద్ధార్ధ్‌తో మరో సినిమా చేసేందుకు అగ్రీమెంట్ రాసుకుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నివేదా థామస్‌ను చిత్ర యూనిట్ ఓకే చేసినట్లు తెలుస్తోంది.

యాక్టింగ్ పరంగా నివేదా థామస్‌కు ఎలాంటి వంక పెట్టే ఛాన్స్ లేదు. అమ్మడు అందంతో పాటు అభినయంలోనూ అందరినీ ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. మరోపక్క పవన్ కళ్యాణ్ సినిమాలో నటించేందుకు నివేదా థామస్ రెడీ అవుతోంది. మరి ఈ సినిమాతో అమ్మడి కెరీర్ ఎలా మలుపు తీసుకుటుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news