Moviesకమెడియన్ అలీ ఇంట విషాదం.. కదిలి వెళుతున్న ఇండస్ట్రీ!

కమెడియన్ అలీ ఇంట విషాదం.. కదిలి వెళుతున్న ఇండస్ట్రీ!

తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు అలీ ఇంట విషాదం నెలకొంది. అలీ తల్లి జైతున్ బీబీ గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంది. కాగా గురువారం ఉదయం ఆమె తన స్వస్థలం రాజమహేంద్రవరంలో కన్నుమూశారు. దీంతో అలీ కుటుంబం ఒక్కసారిగా షాక్‌కు గురయ్యింది.

అయితే ఈ విషయం తెలుసుకున్న సమయానికి అలీ హైదరాబాద్‌లో లేరు. ఆయన షూటింగ్ నిమిత్తం రాంచీలో ఉన్నారు. విషయం తెలుసుకుని వెంటనే ఆయన హైదరాబాద్ బయలుదేరారు. కాగా జైతున్ బీబీ మృతదేహాన్ని రాజమహేంద్రవరం నుండి హైదరాబాద్ తరలించేందుకు అలీ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేస్తున్నారు. అలీ మాతృవియోగం గురించి తెలుసుకున్న ఇండస్ట్రీ ప్రముఖులు అలీ ఇంటికి చేరుకుంటున్నారు.

అలీ తన తల్లిపై ఉన్న ప్రేమను పలు సందర్భాల్లో తెలియజేశారు. తాను ఈ స్థాయిలో ఉండటానికి తన తల్లిదండ్రులే కారణమని, వీలు చిక్కినప్పుడల్లా తన తల్లితో సమయం గడపడానికి ఇష్టపడతానని చెప్పుకొచ్చాడు. కాగా జైతున్ బీబీ అంత్యక్రియలను హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news