తెనాలి రామకృష్ణ BA BL రివ్యూ అండ్ రేటింగ్

యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన తాజా చిత్రం తెనాలి రామకృష్ణ BA BL. గతకొంత కాలంగా సరైన హిట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సందీప్ కిషన్ ఈసారి పక్కా కామెడీ జోనర్ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. టీజర్, ట్రైలర్ల ద్వారా మంచి బజ్‌ను క్రియేట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర అలరించిందో రివ్యూలో చూద్దాం.

కథ:
తెనాలి రామకృష్ణ(సందీప్ కిషన్) సరైన కేసులు లేక రాజీలు కుదురుస్తుంటాడు. ఇరు వర్గాల మధ్య రాజీ కుదుర్చడంలో దిట్టగా మారతాడు తెనాలి రామకృష్ణ. ఈ క్రమంలో అతడికి కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఇందులో భాగంగా వరలక్ష్మీ శరత్ కుమార్‌కు సంబంధించిన ఓ కేసును తెనాలి రామకృష్ణ వాదించాల్సి వస్తుంది. ఇంతకీ ఆ కేసు దేనికి సంబంధించింది..? ఈ కేసులో ఎలాంటి ట్విస్టులు ఉన్నాయి..? ఈ కేసులో రామకృష్ణ గెలుస్తాడా లేడా? అనేది సినిమా కథ.

విశ్లేషణ:
విభిన్న కథాంశాలతో సినిమాలు చేస్తూ సక్సెస్‌ కోసం ఎదురుచూస్తోన్న సందీప్ కిషన్ ఈసారి పూర్తిగా కామెడీ జోనర్ మూవీతో తెనాలి రామకృష్ణగా మనముందుకు వచ్చాడు. ఈ సినిమా కథనానికి వస్తే.. ఫస్టాఫ్‌లో హీరో పాత్రను ఎలివేట్ చేసిన విధానం బాగుంది. కథలో లీనం చేసే వరకు దర్శకుడు నాగేశ్వర రెడ్డి తనదైన స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్‌తో సందీప్ చేసే రొమాన్స్ బాగుంది. అటు కథలో లీనం చేస్తూనే కామెడీని ఎక్కడా కూడా సైడ్ ట్రాక్ కాకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. ఒక అదిరిపోయే ట్విస్టుతో వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది.

సెకండాఫ్ పూర్తిగా కథలో లీనమయ్యేలా చేస్తుంది. ఈ క్రమంలోనూ వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. ముఖ్యంగా సందీప్ కిషన్ ఈ సినిమా కోసం తీసుకున్న జాగ్రత్తలు ప్రేక్షకులను సినిమా నుండి డైవర్ట్ కాకుండా చేస్తుంది. ఇక ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్‌లో చాలా మంది కమెడియన్ల సాయంతో దర్శకుడు పూయించిన నవ్వులు మామూలుగా పేలలేదు. ఒక చక్కటి నోట్‌తో సినిమాకు శుభం కార్డు వేశాడు దర్శకుడు.

ఓవరాల్‌గా చూస్తే.. సందీప్ కిషన్ ఎప్పటిలాగా రొటీన్ ఫార్మాట్‌ను కాకుండా పూర్తిగా కామెడీ జోనర్‌తో సక్సెస్ అందుకోవాలని చేసిన ప్రయత్నం ఫలించిందనే చెప్పాలి. దర్శకుడు నాగేశ్వర రెడ్డి ఎంచుకున్న స్టోరీ లైన్ రొటీన్ అయినప్పటికీ కామెడీతో అది మర్చిపోయేలా చేశాడు. సందీప్ కెరీర్‌లో ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకోనుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

నటీనటుల పర్ఫార్మెన్స్:
తెనాలి రామకృష్ణ పాత్రలో హీరో సందీప్ కిషన్ యాక్టింగ్ చాలా బాగుంది. ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ కామెడీని పండించి ప్రేక్షకులను నవ్వించాడు సందీప్. హీరోయిన్‌గా హన్సికా మోత్వానీ పర్వాలేదనిపించింది. సినిమాలో మరో ముఖ్య పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటన బాగుంది. సినిమాలో మిగతా నటీనటులు వారి పరిధిమేర బాగా నటించారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
దర్శకుడు నాగేశ్వర రెడ్డి రాసుకున్న రొటీన్ కథకు తనదైన కామెడీతో మరింత అందం తీసుకొచ్చారు. కామెడీని ఎక్కడ పండించాలో అక్కడ పండించడంతో సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా ఉంటుంది. సాయి కార్తీక్ సంగీతం బాగుంది. కొన్ని సీన్స్‌లో బీజీఎం ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పనులు బాగున్నాయి. నిర్మాణ విలువలు పర్వాలేదు.

చివరగా:
తెనాలి రామకృష్ణ – కామెడీతో కుమ్మేశాడు

రేటింగ్: 2.75/5.0

Leave a comment