కిక్ ఇచ్చేందుకు మాస్ రాజా రెడీ

మాస్ రాజా రవితేజ నటిస్తోన్న తాజా చిత్రం డిస్కో రాజా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు మాస్ ఫ్యాన్స్‌ను అమితంగా ఆకట్టుకున్నాయి. ఇక తన నెక్ట్స్ మూవీని ఇప్పటికే అనౌన్స్ చేశాడు రవితేజ. గోపిచంద్ మలినేనితో తన 66వ చిత్రాన్ని ప్రకటించాడు రవితేజ. కాగా మరో డైరెక్టర్ నక్కిన త్రినాథ రావు దర్శకత్వంలో తన సినిమాను లైన్‌లో పెట్టాడు రవితేజ.

ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఈ సినిమా కథను దర్శకుడు పూర్తి చేయగా, మాస్ రాజా తన పాత్ర పట్ల ఫుల్ ఖుషీగా ఉన్నాడట. ఈ సినిమాలో కిక్ తరహా కామెడీ ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. గతంలో కామెడీకి పెద్దపీట వేసిన రవితేజ, ఈ మధ్య కామెడీని తగ్గించాడు. కానీ త్రినాథ రావు రాసుకున్న కథలో కిక్ సినిమా లాంటి కామెడీ ఉందని తెలుస్తోంది.

ఈ సినిమాను మెగా నిర్మాత అల్లు అరవింద్ ప్రొడ్యూస్ చేయనున్నట్లు తెలుస్తోంది. గోపీచంద్ మలినేని సినిమా తరువాత ఈ సినిమాను మాస్ రాజా తెరకెక్కించనున్నాడు. మరి ఈ సినిమాలో కామెడీ నిజంగానే కిక్ ఇస్తుందా అనేది వేచి చూడాలి.

Leave a comment