మాస్ ‘దాస్’కి డాక్టర్ ‘దాస్’ క్లాప్

తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ నగరానికి ఏమైంది చిత్రంతో ఫేం సంపాదించిన విశ్వక్ సేన్ తరువాత తానే డైరెక్టర్‌గా మారి చేసిన చిత్రం ఫలక్‌నుమా దాస్ బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాతో మాస్ హీరోగా ఎదగాలని భారీ ప్రయత్నం చేశాడు విశ్వక్ సేన్. కానీ అతడు అనుకున్న స్థాయిలో సక్సెస్‌ను అందుకోలేకపోయాడు. దీంతో తన నెక్ట్స్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు ఈ హీరో.

అయితే ఈ సినిమాను నేచురల్ స్టార్ నాని ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ పోస్టర్ రిలీజ్ కాగా తాజాగా ఈ సినిమాను హీరో నాని క్లాప్ కొట్టి లాంఛ్ చేశారు. ఈ సినిమాకు ‘‘హిట్ – ది ఫస్ట్ ఛేజ్’’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో హీరోయిన్‌గా చిలసౌ ఫేం రుహాని శర్మ కూడా ఉండటంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక ఈ సినిమాను కొత్త దర్శకుడు సైలేష్ కొలను డైరెక్ట్ చేస్తుండగా ప్రశాంతి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం వివేక్ సాగర్ అందిస్తుండగా మణికందన్ సినిమాటోగ్రఫీ అదనపు ఆకర్షణ కానుంది. నాని నిర్మాణంలో గతంలో వచ్చిన అ… లాగే ఈ సినిమా కూడా మంచి క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

Leave a comment