అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు మహేష్.. పాపం ఫ్యాన్స్!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాతో మహేష్ మరోసారి సంక్రాంతి సెంటిమెంట్‌ను కంటిన్యూ చేస్తాడనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ అంశం మహేష్ ఫ్యాన్స్‌ను కాస్త ఆందోళనకు గురి చేస్తోంది.

అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఓ హాట్ ఐటెం సాంగ్ కూడా ఉందట. అయితే ఈ సినిమాలో ఆ హాట్ ఐటెం సాంగ్ చేస్తోంది మరెవరో కాదట.. మిల్కీ బ్యూటీ తమన్నా అని తెలుస్తోంది. తమన్నా ఇప్పటికే ఎన్టీఆర్ జై లవకుశ చిత్రంలో ‘‘స్వింగ్ జరా..’’ అంటూ ఓ హాట్ ఐటెం సాంగ్ చేసింది. అయితే అదెందుకో జనాలకు అంతగా ఎక్కలేదు. దీంతో ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న ‘‘బందరు మిఠాయి బోర్డరు సిపాయి’’ అనే ఐటెం సాంగ్ ఎంతమందికి నచ్చుతుందో అనే అంశం ప్రేక్షకుల్లో ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తోంది.

దర్శకుడు అనిల్ రావిపూడి రాసుకున్న కథనం ప్రకారం ఈ సినిమాను పక్కా ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది. ఈ సినిమాతో మహేష్ మరోసారి బాక్సాఫీస్ రికార్డులకు పాతర వేయడం ఖాయమని తెలుస్తోంది. మరి ఈ సినిమాకు తమన్నా ఐటెం సాంగ్ ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.