ప్రీమియ‌ర్ షోల్లో సైరా స‌రికొత్త రికార్డు

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ చిత్ర విడుదలకు ఇంకొన్ని గంటలే సమయం ఉంది. ఇప్ప‌టికే భార‌త‌దేశ‌వ్యాప్తంగాను, అటు వ‌ర‌ల్డ్‌వైడ్‌గాను సైరా హ‌డావిడి స్టార్ట్ అయ్యింది. మెగా అభిమానులు అయితే సైరా ఫీవ‌ర్‌తో ఊగిపోతున్నారు. ఇక ఏపీలో అయితే చాలా చోట్ల మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి నుంచే సైరా ప్రీమియ‌ర్లు వేసేంద‌కు రెడీ అవుతున్నారు.

ఈ క్ర‌మంలోనే డిస్ట్రిబ్యూటర్లు స్పెషల్ షోలు వేయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఈ షోస్ కన్ఫర్మ్ అవగా చెన్నై సిటీలో సైతం భారీ స్థాయిలో స్పెషల్ షోస్ వేయనున్నారు. చెన్నైలో భారీగా తెలుగు ప్రేక్ష‌కులు ఉన్నారు. వీరిలో మెగా అభిమానుల సంఖ్య ల‌క్ష‌ల్లోనే ఉంది. ఇక చెన్నైలో తెలుగు ప్రేక్ష‌కుల కోసం అక్క‌డ సైరా తెలుగు వెర్ష‌న్ షోలు ఉద‌యం 8 గంట‌ల‌కే ఏకంగా 50 ప్లాన్ చేశారు.

చెన్నై న‌గ‌రంలో ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు ఇన్ని స్పెషల్ షోలు వేయలేదు. ఈమధ్యే విడుదలైన ‘సాహో’కి కూడా 30 స్పెషల్ షోలు వేయడం జరిగింది. సో ఇక్కడ కూడా ‘సైరా’ కొత్త రికార్డ్ నెలకొల్పింది. ఇక ఈ సినిమా త‌మిళ‌నాడులో కూడా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాను అక్క‌డ ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్ తమిళనాట విడుదల చేయనుంది. విజయ్ సేతుపతి, నయనతార లాంటి బడా స్టార్స్ ఇందులో నటించడంతో తమిళ ప్రేక్షకుల్లో కూడా సినిమాపై మంచి అంచనాలున్నాయి. రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేశారు.

Leave a comment