ఫిదా పోరితో లవ్ స్టోరీ నడిపిస్తున్న అక్కినేని హీరో

టాలీవుడ్‌లో క్లాస్ డైరెక్టర్‌గా పేరొందిన శేఖర్ కమ్ముల ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఫిదాతో అదిరిపోయే బ్లాక్‌బస్టర్ కొట్టిన కమ్ముల మరోసారి ఫిదా పోరితో రానున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలుపెట్టిన ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న ఈ సినిమాకు వెరైటీ టైటిల్‌ ఏం పెట్టకుండా చాలా సాదాసీదా టైటిల్‌ను పెట్టారట. ఈ సినిమాకు లవ్ స్టోరీ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు లవ్ స్టోరీ అనే టైటిల్ పర్ఫెక్ట్ యాప్ట్ అవుతుందని కమ్ముల భావించాడట. అందుకే వెరైటీ టైటిల్స్ జోలికి వెళ్లకుండా ఈ టైటిల్‌ను పెట్టినట్లు తెలుస్తోంది.

ఏషియన్ కంపెనీ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఏదేమైనా చాలా సింపుల్ టైటిల్‌తో కూడా సంచలనాలు క్రియేట్ చేయడం శేఖర్ కమ్ములకు కొత్తేమీ కాదంటున్నారు సినీ జనం.

Leave a comment