మిస్ ఇండియా కోసం విశ్వప్రయత్నం చేస్తున్న బ్యూటీ

తెలుగులో మహానటి చిత్రంతో ఒక్కసారిగా లైం లైట్‌లోకి వచ్చి సూపర్ సక్సెస్ కొట్టిన ఈ బ్యూటీ ఆ తరువాత తెలుగులో మరే సినిమా చేయలేదు. అయితే ఇటీవల ఆమె తన కొత్త సినిమాను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు మిస్ ఇండియా అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఖరారు చేసింది.

ఈ సినిమా కోసం కీర్తి సురేష్ చాలా కష్టపడుతోందట. ఈ చిత్రంలో ఆమె పాత్ర కోసం ఏకంగా 50 టెస్ట్ లుక్‌లు ఇచ్చిందంటే ఆమె ఈ సినిమాను ఎంత ప్రెస్టీజియస్‌గా తీసుకుందో తెలిస్తోంది. ఇక ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని చిత్ర యూనిట్ పేర్కొంది. అటు ఆమె ఈ పాత్ర కోసం ఇప్పటికే సన్నబడిన విషయం కూడా తెలిసిందే.

మిస్ ఇండియా చిత్రాన్ని నూతన దర్శకుడు నరేంద్రనాధ్ డైరెక్ట్ చేస్తుండగా నిర్మాత మహేష్ కోనేరు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను ఇప్పటికైతే అనౌన్స్ చేయలేదు చిత్ర యూనిట్. మరి మిస్ ఇండియా చిత్రం కీర్తి సురేష్ కెరీర్‌కు ఎలా ఉపయోగపడుతుందో చూడాలి.

Leave a comment