చరణ్‌ను ఫాలో అవుతున్న 90 ఎంఎల్ హీరో

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రం ఎలాంటి భయాన్ని క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. సినిమా చూసిన ప్రతి వ్యక్తి ఇదేం సినిమారా బాబూ అంటూ థియేటర్ నుండి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా చూసిన ఆడియెన్స్ పరిస్థితి ఎలా ఉందో అప్పట్లో ఎవ్వరిని అడిగిన తెలిసిందే. అయితే ఇందులో రామ్ చరణ్ చేసిన ఓ యాక్షన్ సీన్ మాత్రం జనాలకు చిర్రెత్తించింది.

ఇప్పుడు ఈ సోది ఎందుకు అనుకుంటున్నారా.. అసలు విషయం ఏమిటంటే.. వినయ విధేయ రామలో రామ్ చరణ్ చేసిన ఓ ఫీట్‌ను యంగ్ హీరో కార్తికేయ కూడా రిపీట్ చేస్తున్నాడు. కార్తీకేయ ప్రస్తుతం నటిస్తోన్న 90 ML చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమాలో ఓ సాంగ్ కోసం అజెర్బిజాన్ అనే ప్రాంతానికి వెళుతున్నారు. అక్కడ హీరో కార్తీకేయ మరియు హీరోయిన్ నేహా సోలంకిపై ఓ సాంగ్ చిత్రీకరించనున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే.. ఇదే ప్రాంతంలో వినయ విధేయ రామ సినిమాలో రచ్చ రంబోలా యాక్షన్ సీన్‌ను తెరకెక్కించారు.

మరి ఆ ప్రాంతం చరణ్‌కు ఎలాగూ ఉపయోగపడలేదు.. మరి యంగ్ హీరో కార్తీకేయకు ఎలా ఉపయోగపడుతుందో చూడాలి అంటున్నారు ప్రేక్షకులు. ఏదేమైనా కార్తీకేయకు అంతకు మించిన వేరే ప్రాంతం ఏదీ దొరకలేదా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

Leave a comment