ప‌హిల్వాన్‌ను ప‌ట్టించుకోని రాజ‌మౌళి…!!

అతడో ద‌ర్శ‌క ధీరుడు.. జ‌క్క‌న్న‌గా అంద‌రికి చిర‌ప‌రితుడు.. కాకుంటే సాంఘిక చిత్రాల‌ను తెర‌కెక్కించ‌డంలో మొన‌గాడు అనిపించుకున్న ద‌ర్శ‌కుడు ఎస్ ఎస్ రాజ‌మౌళి. అప్పుడు అదే రాజ‌మౌళి న‌న్ను ప‌ట్టంచుకోవ‌డం లేద‌ని ప‌హిల్వాన్ తెగ బాధ‌ప‌డుతున్నాడు. మ‌రి ఈ ప‌హిల్వాన్‌ను ఎందుకు రాజ‌మౌళి ప‌ట్టించుకోలేద‌బ్బా అనిపించ‌డం స‌హాజ‌మే..

ఇంత‌కు ద‌ర్శ‌క ధీరుడు ప‌ట్టించుకోని ఆ ప‌హిల్వాన్ ఎవ‌రు.. అంత‌లా రాజ‌మౌళి గురించి ఆయ‌న భాద‌ప‌డాల్సిన అవ‌సరం ఏంటీ.. అనుకుంటున్నారా.. రాజ‌మౌళి ప‌ట్టించుకోని ప‌హిల్వాన్ ఎవ‌రో కాదు.. మీకు ఈగ సినిమా గుర్తుంది క‌దా.. అందులో ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో హీరో నానీని చంపేస్తే ఈగ చేతిలో ఆగ‌చాట్లు ప‌డ్డ న‌టుడు.. ఆయ‌నే కిచ్చా సుధీప్‌. వాస్త‌వానికి సుదీప్ హీరో. కానీ రాజ‌మౌళీ తెర‌కెక్కించిన చిత్రం ఈగ. ఈ సినిమాలో ప్ర‌తినాయ‌కుడిగా కిచ్చా సుధీప్‌ను తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేశాడు రాజ‌మౌళి.

అయితే సుధీప్ రాజ‌మౌళితో త‌న‌కున్న అనుబంధాన్నిగుర్తు చేసుకుంటూ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి గారు న‌న్ను ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో తీసుకోక‌పోవ‌డంతో చాలా బాధ‌గా ఉంద‌ని ఆవేద‌న చెందాడు.. ఈగ సినిమాలో నాకు కేరీర్‌లో మ‌రిచిపోలేని పాత్ర నిచ్చాడు. త‌రువాత బాహుబ‌లి సినిమాలోను అవ‌కాశం ఇచ్చాడు.. కానీ ఎందుకో ఆర్ ఆర్ ఆర్ లాంటి మెగా సినిమాలో అవ‌కాశం ఇవ్వ‌లేదు.. అది నాకు చాలా బాధ‌గా ఉందంటున్నాడు.. పాపం రాజ‌మౌళి ఈ సుధీప్‌ను ఎందుకు మ‌రిచిపోయాడో రాజ‌మౌళి స్పందిస్తే త‌ప్త తెలియదు.

Leave a comment