బట్టలిప్పిందని బయటకు పంపిన రాజశేఖర్

యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ ప్రస్తుతం వరుస సక్సెస్‌లతో చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే గరుడవేగ, కల్కి వంటి సినిమాలు రాజశేఖర్‌కు గ్రాండ్ కమ్ బ్యాక్‌ మూవీలుగా నిలిచాయి. ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్టుల విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు ఈ హీరో. కాగా ఇటీవల తన నెక్ట్స్ మూవీని అనౌన్స్ చేశాడు రాజశేఖర్.

తమిళ దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి డైరెక్షన్‌లో తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు ఈ హీరో. గతంలో సత్య, బేతాళుడు వంటి సినిమాలు డైరెక్ట్ చేసిన ఈ దర్శకుడు ఓ అదిరిపోయే కథను రాజశేఖర్‌కు వినిపించడంతో ఆయన వెంటనే ఆ సినిమాకు ఓకే చెప్పాడట. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా ఆమె సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన బ్లాక్ బ్యూటీ అమలా పాల్‌ను సెలెక్ట్ చేశారు చిత్ర యూనిట్. ఆమె సినిమాలో శరీరంపై నూలుపోగు లేకుండా నటించి ఆడియెన్స్‌కు షాకిచ్చిన ఈ బ్యూటీని హీరోయిన్‌గా సెలెక్ట్ చేయడంతో ఆమె పాత్ర ఎలా ఉంటుందా అనే ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పుడు మరో బ్యూటీ నందిని శ్వేతాను ఈ సినిమాలో హీరోయిన్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరి అమలా పాల్‌ను ఈ సినిమా నుండి తప్పించారా లేక రెండో హీరోయిన్‌గా నందిని శ్వేతా నటిస్తుందా అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉందని సినీ క్రిటిక్స్ అంటున్నారు. ఏదేమైనా గత సినిమాలో బట్టలిప్పినందుకే అమలా పాల్‌ను బయటకు పంపారని గుసగుసలు ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

Leave a comment