Moviesయూఎస్‌లో దుమ్ములేపుతున్న ఎవరు..

యూఎస్‌లో దుమ్ములేపుతున్న ఎవరు..

ఆగష్టు 15న టాలీవుడ్‌లో రిలీజ్ అయిన రెండు సినిమాలు ఎవరు, రణరంగం మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. అయితే ఎవరు సినిమా సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కడంతో రణరంగం సినిమా కంటే కాస్త ఎక్కువ ఇంప్రెషన్ కొట్టేసింది. ఇక ఈ సినిమా కంటెంట్ కూడా అదే రేంజ్‌లో ఉండటంతో ఈ సినిమాకు ఎక్కువ ఓట్లు పడ్డాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాలు రెండు కూడా బాగానే ఆడుతున్నాయి. కానీ ఓవర్సీస్‌లో ఒక్క సినిమాకు మాత్రమే జనం ఓటేస్తున్నారు.

ఎవరు సినిమా సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కడంతో యూఎస్ ఆడియెన్స్ ఆ సినిమాకు పెద్దపీట వేశారు. అడవి శేష్ రాసుకున్న గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే సినిమాను ఎక్కడా బోర్ కొట్టించకుండా చేసింది. అయితే రణరంగం కాస్త స్లో నెరేషన్ ఉండటంతో ఆ సినిమాకు ఓవర్సీస్ జనాలు ఆసక్తి చూపించడం లేదు. ఇక ఈ రెండు సినిమాలు కూడా యూఎస్ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతున్నాయి. ముఖ్యంగా ఎవరు సినిమా బుధవారం ప్రీమియర్లలో $61,499 కలెక్ట్ చేసి, గురువారం నాడు $43,320 కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ $1,21,822 గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తుంది.

అటు రణరంగం సినిమాకు ప్రీమియర్లు లేకపోవడంతో ఈ సినిమా కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడింది. గురువారం నాడు $24,014 గ్రాస్ వసూళ్లు సాధించిన రణరంగం, తాజా సమాచారం ప్రకారం $27,892 మాత్రమే ఈ సినిమా కలెక్ట్ చేసినట్లు ట్రేడ వర్గాలు తెలిపాయ. మొత్తంగా చూస్తే ఈ రెండు సినిమాల్లో ఓవర్సీస్‌లో విజేత ఎవరు అనే ప్రశ్నకు సమాధానం కూడా ప్రశ్నలోనే ఉండిపోయింది.

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news