Movies" సైరా నరసింహారెడ్డి " మేకింగ్ వీడియో.. బాహుబలి కాదు...

” సైరా నరసింహారెడ్డి ” మేకింగ్ వీడియో.. బాహుబలి కాదు అంతకుమించి..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా 151వ సినిమాగా వస్తున్న సైరా నరసిం హా రెడ్డి సినిమా మేకింగ్ వీడియో కొద్దినిమిషాల క్రితం రిలీజైంది. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మిస్తున్నారు. 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మేకింగ్ వీడియో సినిమాపై మరింత అంచనాలు పెంచింది.

పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసిం హా రెడ్డి పాత్రలో చిరంజీవి అదరగొట్టారని చెప్పొచ్చు. ఇప్పటికే సైరా టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేయగా ఈ మేకింగ్ వీడియో సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది. ముఖ్యంగా విజువల్స్ భారీతనంతో ఉన్నాయి.. యుద్ధ సన్నివేశాలు.. కెమెరా వర్క్.. కాస్టింగ్ సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లేలా ఉన్నాయి. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది. మళ్లీ మరోసారి సైరాతో దాన్ని మించే సంచలనం సృష్టిస్తుదని తెలుస్తుంది.

సినిమా స్టార్ కాస్ట్ మొత్తాన్ని పరిచయం చేసి చివర్లో నరసిం హా రెడ్డి వీరత్వన్ని చూపిస్తూ చిరంజీవి స్టిల్ అదరగొట్టాడు. ఇక ఆగష్టు 15న టీజర్ వస్తుందని భావించగా ఆగష్టు 20 చిరంజీవి బర్త్ డే రోజు సినిమా టీజర్ ను రిలీజ్ చేస్తారని ఎనౌన్స్ చేశారు. మొత్తానికి మేకింగ్ వీడియో సైరా మరో సెన్సేషన్ అవడం ఖాయమని చెప్పొచ్చు.

Latest news