Moviesబిగ్ బాస్‌లో సూసైడ్ అటెంప్ట్.. షాక్‌లో ఫ్యాన్స్..

బిగ్ బాస్‌లో సూసైడ్ అటెంప్ట్.. షాక్‌లో ఫ్యాన్స్..

బుల్లితెరపై సూపర్‌హిట్‌గా ప్రసారమవుతున్న బిగ్ బాస్ షోలో ఎప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారా అని ప్రేక్షకులు చాలా ఆసక్తిగా చూస్తుంటారు. ఇక తెలుగు బిగ్ బాస్‌లో కింగ్ నాగార్జున్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా తమిళ బిగ్ బాస్‌లో కమల్ హాసన్ హోస్ట్‌గా చేస్తున్నాడు. కాగా వివాదాలకు కేరాఫ్‌గా ఉండే బిగ్‌బాస్‌లో ఓ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఏకంగా ఓ నటి ఆత్మహత్యాయత్నం చేసింది.

తమిళ బిగ్ బాస్‌లో ఈ వారం కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన హాస్య నటి ముధుమిత, తన తోటి కంటెస్టంట్స్‌ చేస్తున్న కామెంట్స్‌ను జీర్ణించుకోలేకపోయింది. దీంతో మానసిక ఒత్తిడికి గురైన ఆమె ఏకంగా సూసైడ్ అటెంప్ట్ చేసింది. వెంటనే తేరుకున్న బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెను బిగ్ బాస్ హౌజ్ నుండి పంపించేశారు. ఈ ఘటనతో తమిళ బిగ్ బాస్ షో మరో వివాదంలోకి వెళ్లిపోయింది.

ఆత్మహత్య చేసుకునేంత ఒత్తిడిని కంటెస్టంట్స్‌పై రుద్దుతున్నారని పలు సంఘాలు బిగ్ బాస్‌పై మండిపడుతున్నారు. కాగా ఇవేమీ పట్టించుకోని బిగ్ బాస్ నిర్వాహకులు తమ పని తాము కానిచ్చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news