Gossipsప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే షాక్‌..

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే షాక్‌..

ప్ర‌భాస్ హైఓల్టేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ సాహో మ‌రో 4 రోజుల్లో సాహో విడుదల నేపథ్యంలో ప్రభాస్ ప్రచారంలో బిజీగా ఉన్నారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ ఎక్క‌డిక‌క్క‌డ టీవీ కార్య‌క్ర‌మాల్లోనూ, మీడియా ప్ర‌తినిధుల‌తోనూ మీట్ అవుతూ ప్ర‌చారం హోరెత్తిస్తున్నాడు. అన్ని భాష‌ల్లోనూ సాహోకు భారీ హైప్ క్రియేట్ కావడం గమనార్హం. యావ‌త్ దేశ‌వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు అంతా సాహో.. సాహో అంటూ నామ‌స్మ‌ర‌ణ చేస్తున్నారు.

సాహో అడ్వాన్స్ బుకింగ్‌లు మైండ్ బ్లాక్ అయ్యేలా ఉన్నాయి. ఇక తాజా ఇంట‌ర్వ్యూలో ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు ఓ డిజాప్పాయింట్ న్యూస్ చెప్పాడు. మీ నెక్ట్స్ సినిమా కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుందా అన్న ప్రశ్నకు, ఇకపై నేను భారీ చిత్రాలలో నటించను అని షాకింగ్ న్యూస్ చెప్పారు. భారీ బడ్జెట్ సినిమాలు వ‌రుస‌గా చేస్తుండ‌డంతో ఎక్కువ సినిమాలు చేయ‌లేక‌పోతున్నాన‌ని చెప్పాడు.

ప్ర‌భాస్ గ‌త ఏడేళ్ల‌లో కేవ‌లం మూడు సినిమాలు మాత్ర‌మే చేశాడు. బాహుబ‌లి 1,2, సాహో సినిమాలు మాత్ర‌మే ప్ర‌భాస్ నుంచి వ‌చ్చాయి. దీంతో వ‌రుస‌గా భారీ బ‌డ్జెట్ సినిమాలు చేయ‌న‌ని చెప్పేశాడు. ఈ వార్త ప్ర‌భాస్ ఇండియ‌న్ సినిమా ల‌వ‌ర్స్‌కు కాస్త డిజాప్పాయింట్ లాంటిదే. అయితే అదే స‌మ‌యంలో ఓ గుడ్ న్యూస్ కూడా ప్ర‌భాస్ చెప్పాడు. ఇకపై ఏడాదికి రెండు చిత్రాలకు తగ్గకుండా చేస్తాను అని చెప్పడంతో ఫ్యాన్స్‌కు కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news