సాహో దారిలో సాగిపోనున్న సైరా..!

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోలను ఆలోచనలో పడేసింది. సాహో వేసుకున్న పథకం ప్రకారం తనకు ఉన్న ఇమేజ్ను డ్యామేజ్ కాకుండా… ఎలా క్యాష్ చేసుకోవాలో పక్కా ప్లాన్ ప్రకారం ముందుకు సాగుతున్నాడు.. ప్రభాస్ తీసుకున్న ఈ నిర్ణయం ను ఇప్పుడు మెగాస్టార్ కూడా ఫాలో అవుదామని నిర్ణయించుకున్నాడు.. ఇంతకు సాహో దారిలో సైరా ఎలా ముందుకు సాగాలనుకుంటున్నాడు… ఓలుక్కేద్దాం.

యంగ్ రెబల్ స్టార్‌కు టాలీవుడ్‌తో పాటు దక్షిణాది, ఉత్తరాది అనే తేడా లేకుండా మార్కెట్ ఉంది. బాహుబలి ఇచ్చిన ఇమేజ్ ను సొంతం చేసుకునేందుకు సాహోను ఉపయోగించుకుంటున్నాడు ప్రభాస్. ప్రభాస్‌కు ఎట్లాగు టాలీవుడ్లో ఇమేజ్ ఉంది… ఇక మిగిలింది బాలీవుడ్లో.. అందుకే బాలీవుడ్లో సాహో సినిమాకు హైప్ తీసుకురాగలిగితే ఇక తిరుగేలేదని గ్రహించాడు ప్రభాస్… అందుకే బాక్సాఫీసు బద్దలు కొట్టాలంటే సాహోను సాధ్యమైనంత మేరకు అక్కడే ఎక్కువ ప్రమోషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనుకున్నాడు..

సాహో సినిమాను హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కించి బాలీవుడ్లో బంఫర్ హిట్ చేసుకుంటే మార్కెట్‌కు తిరుగుండదని గ్రహించి ముంబాయి కేంద్రంగా సాహో ట్రైలర్‌ను విడుదల చేశాడు. ఇక ఇదే దారిలో మెగాస్టార్ చిరంజీవి కూడా నడువ నున్నాడు. మెగాస్టార్ చిరంజీవి నటుడిగా, రాజకీయ నాయకుడిగా దేశవ్యాప్తంగా ఇమేజ్ ఉంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు సైరా సినిమా ప్రమోషన్ బాలీవుడ్లో ఎక్కువగా చేయాలని ఉబలాటపడుతున్నాడు. అందుకే సైరా సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమం ఈనెల 14నుంచి శ్రీకారం చుడుతున్నారు.

ఈనెల 14న సైరా మేకింగ్ వీడియో విడుదల చేసి, 20న ముంబాయ్‌లోనే భారీ పంక్షన్ ఏర్పాటు చేసి బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ సమక్షంలో టీజర్‌తో పాటు సినిమాకు సంబంధించిన కొన్ని ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. తరువాతే చిరంజీవి విదేశాలకు వెళ్ళి అక్కడే తన పుట్టిన రోజును జరుపుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాడు. ఇక అక్టోబర్ 2న సినిమాను విడుదల చేయనున్నాడు.

Leave a comment