రాక్షసుడు రెండు వారాల కలెక్షన్స్..

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన లేటెస్ట్ సస్పె్న్స్ థ్రిల్లర్ రాక్షసుడు మొదట్నుండీ మంచి అంచనాలు క్రియేట్ చేస్తూ ప్రేక్షకుల్లో మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. తమిళ చిత్రం ‘రాచ్ఛసన్’కు తెలుగు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో ఈ సినిమా చూసేందుకు జనాలు ఆసక్తి చూపించారు.

సస్పెన్స్ లవర్స్‌కు ఫుల్ మీల్స్‌లా ఉండే ఈ సినిమాను బీ,సీ సెంటర్ల ప్రేక్షకులు పిచ్చపిచ్చగా ఎంజాయ్ చేశారు. ఏ క్లాస్ ఆడియెన్స్‌ కూడా ఈ సినిమాకు మంచి మార్కులు వేశారు. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లూ సాధించింది. రెండు వారాలు ముగిసే సరికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.11.82 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేసి సూపర్ హిట్ మూవీగా నిలిచింది.

ఏరియాల వారీగా ఈ సినిమా కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.
ఏరియా – రెండు వారాల కలెక్షన్స్(కోట్లలో)
నైజాం – 3.95
సీడెడ్ – 1.40
నెల్లూరు – 0.33
కృష్ణా – 0.85
గుంటూరు – 0.85
వైజాగ్ – 1.80
తూ.గో – 0.90
ప.గో – 0.64
టోటల్ ఏపీ+తెలంగాణ – 10.72 కోట్లు
కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా – 0.75
ఓవర్సీస్ – 0.35
టోటల్ వరల్డ్‌వైడ్ – 11.82 కోట్లు

Leave a comment