‘ రాక్ష‌సుడు ‘ వ‌ర‌ల్డ్ వైడ్ 3 డేస్ క‌లెక్ష‌న్స్‌… టార్గెట్ రీచ్ అవుతాడా…

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ సినిమా రాక్ష‌సుడు. కోలీవుడ్‌లో హిట్ అయిన రాట్చ‌స‌న్ సినిమాకు రీమేక్‌గా ర‌మేష్‌వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాకు తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ వ‌చ్చింది. అయితే సినిమాకు టాక్ బాగున్నా తొలి రోజు వ‌సూళ్లు మాత్రం ఆశాజ‌న‌కంగా లేవు. ఎడెతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వ‌ర్షాల‌కు తోడు బెల్లంకొండ గ‌త సినిమాలు ప్లాప్ అవ్వ‌డంతో తొలి రోజు కేవ‌లం రూ.2 కోట్ల షేర్ మాత్ర‌మే వ‌చ్చింది.

రెండో రోజు నుంచి టాక్ బాగా స్ప్రెడ్ అవ్వ‌డంతో వ‌సూళ్లు కాస్త పెరిగాయి. రూ.17 కోట్ల వ‌ర‌ల్డ్ వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఫ‌స్ట్ వీకెండ్ మూడు రోజులు ముగిసే స‌రికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.6.65 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఏరియాల వారీగా రాక్ష‌సుడు సినిమా వ‌సూళ్లు ఇలా ఉన్నాయి.

నైజాం – 2.30

సీడెడ్ – 0.86

నెల్లూరు – 0.17

కృష్ణా – 0.43

గుంటూరు – 0.45

వైజాగ్ – 0.86

ఈస్ట్ – 0.40

వెస్ట్ – 0.33
———————————
ఏపీ + తెలంగాణ = 5.80
———————————

రెస్టాఫ్ ఇండియా – 0.60

ఓవ‌ర్సీస్ – 0.25
———————————————
టోట‌ల్ వ‌ర‌ల్డ్ వైడ్ షేర్ = 6.65 కోట్లు
———————————————

Leave a comment