Gossips' రాక్ష‌సుడు ' ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌... సినిమా హిట్‌... వ‌సూళ్లు...

‘ రాక్ష‌సుడు ‘ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌… సినిమా హిట్‌… వ‌సూళ్లు ఫ‌ట్‌

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ – అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా తెర‌కెక్కిన రాక్ష‌సుడు సినిమా ఈ శుక్ర‌వారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కోలీవుడ్‌లో హిట్ అయిన రట్సాసన్ అనే సినిమాకి రాక్ష‌సుడు రీమేక్. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ పొలీసు ఆఫీసర్ పాత్ర పోషించాడు. ఓ సైకో కిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ సినిమాకు తొలి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

వ‌రుస ప్లాపుల‌తో ఉన్న బెల్లంకొండ కెరీర్‌కు ఈ సినిమా కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. క‌వ‌చం – సీత లాంటి డిజాస్ట‌ర్ల‌తో ఉన్న శ్రీనివాస్ రాక్ష‌సుడు హిట్‌తో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా పొందాడు. ఇక ఈ సినిమా తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.96 కోట్ల షేర్ రాబ‌ట్టింది. రాక్ష‌సుడు ప్రి రిలీజ్ బిజినెస్ రూ.14 కోట్లు. తొలి రోజు సూప‌ర్ హిట్ టాక్ వ‌చ్చినా కేవ‌లం రెండు కోట్ల షేర్ రావ‌డం కాస్త నిరాశ‌ప‌రిచే విష‌య‌మే. మ‌న్మ‌థుడు 2 సినిమా వ‌చ్చే వర‌కు వారం రోజుల పాటు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రాక్ష‌సుడు కుమ్ముకోవ‌చ్చు. మ‌రి బెల్లంకొండ స‌త్తా ఏంటో చూడాలి.

రాక్ష‌సుడు ఫ‌స్ట్ డే టోట‌ల్ క‌లెక్ష‌న్స్ (రూ.కోట్ల‌లో) :

నైజాం – 0.63

సీడెడ్ – 0.30

ఉత్తరాంధ్ర – 0.34

ఈస్ట్ – 0.14

కృష్ణ – 0.13

గుంటూరు – 0.23

వెస్ట్ – 0.13

నెల్లూరు – 0.06
————————————-
ఏపీ + తెలంగాణ షేర్ = 1.96
————————————-

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news