కాజల్‌ను ఆటాడుకుంటున్న తలైవా ఫ్యాన్స్..!

అందాల భామ కాజల్ అగర్వాల్ కాంట్రోవర్సీలకు చాలా దూరం ఉంటుంది. తన సినిమాలు కూడా ఎలాంటి కాంట్రోవర్సీల్లో చిక్కకుండా జాగ్రత్త పడుతూ వస్తోంది. అయితే తాజాగా అమ్మడు నటించిన ఓ సినిమా ఆమెకు పెద్ద తలనొప్పిని తెచ్చిపెట్టింది. ఇంతకీ అమ్మడు చేసిన సినిమా ఏమిటి..? ఆమెకు తలనొప్పి ఎందుకు తెచ్చిపెట్టింది..?

కాజల్ తమిళంలో నటించిన లేటెస్ట్ మూవీ కోమలిలో జయం రవి కోమా నుండి బయటపడ్డ వ్యక్తిగా నటిస్తున్నాడు. అతడు కోమా నుండి బయట పడినప్పుడు పక్కనున్న వాళ్లను ఇది ఏ సంవత్సరం అని అడగ్గా అది 2016 అని చెప్పాడు. అయితే అదే సమయంలో టీవీలో రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు అనౌన్స్ చేసిన సీన్ కనిపిస్తుంది. దీంతో జయం రవి ఇది 1996లో జరిగింది. మీరు ఎవరిని మోసం చేస్తున్నారంటూ డైలాగ్ కొట్టాడు. అంతే దీంతో తలైవా ఫ్యాన్స్‌కు ఎక్కడో కాలింది. వెంటనే కోమలి చిత్రంపై తలైవా ఫ్యాన్స్ వార్ డిక్లేర్ చేశారు.

కోమలి సినిమాను సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. బ్యాన్ కోమలి అనే హ్యాష్‌ట్యాగ్‌తో సినిమాను నిలిపివేయాలంటూ వారు నిరసన తెలుపుతున్నారు. అటు చిత్ర యూనిట్ వెంటనే ఈ సీన్లను సినిమా నుండి తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వ్యవహారం ఎక్కడిదాకా వెళుతుందో చూడాలి.

Leave a comment