ప్రభాస్ సాహోకి ఇన్ని కష్టాలేలా..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ డైరక్షన్ లో వస్తున్న సినిమా సాహో. యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు 300 కోట్ల బడ్జెట్ కేటాయించడం జరిగింది. సినిమాలో హీరోయిన్ గా శ్రద్ధా కపూర్ నటిస్తుంది. ఇంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సాహో సినిమా రిలీజ్ టైంలో పెద్ద కష్టం వచ్చి పడ్డది. ఇప్పటికే ఆగష్టు 15న రిలీజ్ అనుకుని వి.ఎఫ్.ఎక్స్ వర్క్ పూర్తి కాలేదని నెల చివరకు వాయిదా వేశారు.

ఇక సినిమా నుండి వచ్చిన మొదటి సాంగ్ సైకో సయాన్ సాంగ్ తెలుగు ఆడియెన్స్ కు నచ్చలేదు. హింది పాటని డబ్ చేశారన్న టాక్ వచ్చింది. ఇక రిలీజైన రెండో సాంగ్ బాగుందని చెప్పుకునేలోగా అది కూడా కాపీ అని తేలింది. ఇక ఇప్పుడు సాహో కొత్త పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. సాహో ది గేం పోస్టర్ వదలగా అది కూడా రెడీ ప్లేయర్ వన్ గేం థీం నుండి కాపీ చేశారని తెలుస్తుంది. సోషల్ మీడియాలో సాహోపై విపరీతమైన నెగిటివిటీ వస్తుంది.

అయితే వీటన్నిటికి సినిమా సమాధానం చెబుతుందని అంటున్నారు. సినిమాలో ఒక్కో సాంగ్ ఒక్కో మ్యూజిక్ డైరక్టర్ ఇస్తున్నాడు. అందుకే సాహో చిక్కులో పడాల్సి వచ్చింది. మరి వచ్చిన ఈ నెగటివిటీ అంతా పోయి పాజిటివ్ బజ్ ఏర్పరచాలని చూస్తున్నారు సాహో టీం. ఆగష్టు 30న రిలీజ్ కాబోతున్న సాహో సినిమాతో ప్రభాస్ మరో సంచలనం సృష్టించాలని చూస్తున్నాడు. మరి సాహో అనుకున్న రేంజ్ కు వెళ్తుందో లేదో చూడాలి.

Leave a comment