మహానటి సినిమాతో ఒక్కసారిగా నేషనల్ హీరోయిన్‌గా మారిపోయింది కీర్తిసురేష్. ఆ సినిమాకు ముందు వరకు కీర్తికి లేని క్రేజ్ ఆ ఒక్క సినిమాతో వచ్చేసింది. తాజాగా మహానటి సినిమాకు గాను ఆమె నేషనల్ అవార్డు దక్కించుకోవడంతో కీర్తి కిర్తి మామలూగా లేదు. ఇక కీర్తి తాజా చిత్రం మిస్ ఇండియా. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ప్రముఖ పీఆర్వో మహేష్ ఎస్.కోనేరు నిర్మిస్తోన్న ఈ సినిమాకు నరేంద్రనాథ్ దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. 52 నిమిషాల పాటు ఉన్న టీజర్లో లండన్ బ్రిడ్జితో పాటు యూరప్, మూకేలోని పెద్ద నగరాలను చూపించారు. ఇక కీర్తి టోటల్‌గా స్టైల్‌ష్ లుక్‌లో మోడ్రన్ అమ్మాయిగా కనిపిస్తోంది. ఆధునిక భావాలు ఉన్న అమ్మాయిగా మిస్ ఇండియా అయితే ఎలా ఉంటుందన్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కినట్టు టీజర్ చెపుతోంది. థమన్ నేపథ్య సంగీతం బాగుంది. మరి మహానటి క్రేజ్‌తో మిస్ ఇండియాను కీర్తి ఏం చేస్తుందో ? చూడాలి.